26న ఐటీఐలో జాబ్‌మేళా

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ఐటీఐలో మార్చి 26న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐలో ఏ ట్రేడ్‌ పూర్తి చేసిన వారైనా అర్హులేనని పేర్కొన్నారు. ఐటీసీ మనోహరాబాద్‌ కంపెనీలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థినులకు ఇన్‌టెక్‌ రూ.12- రూ.18 వేలు వేతనం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8886334579 నంబరును సంప్రదించాలన్నారు.