అక్షరటుడే, బోధన్ : భార్యను హింసించిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ హరికుమార్ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మాక్లూర్ మండలానికి చెందిన ర్యాపని దేవదాస్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే దేవదాస్‌కు మరో మహిళలో అక్రమ సంబంధం ఏర్పడడంతో ఆ మహిళను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవాలని భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవదాస్‌ను రిమాండ్‌కు తరలించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధించారు.