అక్షరటుడే, ఇందూరు: నగరంలోని 6వ డివిజన్ కు చెందిన వ్యాపారి భూమయ్య బీజేపీలో చేరారు. తన అనుచరులతో కలిసి బుధవారం ఎంపీ ధర్మపురి, అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మోదీ పాలనకు ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ,ఈ సారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.