అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ వెంట నడిచిన వారే నిజమైన నాయకులని నిజామాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిజామాబాద్ అర్బన్ బీఆర్‌ఎస్ కార్యర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాజిరెడ్డితో పాటు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాయకులు పోతే యవనాయకత్వం పుట్టుకొస్తుందన్నారు. కొందరు తమ స్వార్థం కోసం పార్టీ వీడుతున్నారని పేర్కొన్నారు. అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రూ.4 వేల పింఛన్, కల్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇలా అనేక హామీలను విస్మరించిందని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. పసుపు బోర్డు ప్రకటన చేసి ఆరునెలలు గడిచినా ఎందుకు బోర్డు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే పార్లమెంట్‌లో తెలంగాణ తరపున గళం వినిపిస్తానని, పార్లమెంట్ పరిధిలోని అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని బాజిరెడ్డి చెప్పారు.