అక్షరటుడే, ఇందూరు: పార్లమెంట్ ఆవరణలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో మంగళవారం ఎంపీ తన ప్రసంగాన్ని వినిపించారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ ఎంతో సేవ చేశారన్నారు. దేశవ్యాప్త పర్యటన చేస్తూ బంజారాల సాంప్రదాయాన్ని మరవకుండా చైతన్యపరిచారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఉంటారని తెలిపారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉంటారన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆవరణలో ఎందరో మహానుభావుల విగ్రహాలు ఉన్నాయని, వారితోపాటు సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.