అక్షరటుడే, వెబ్ డెస్క్: జన్వాడ రేవ్ పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘ఈ కుటుంబానికి కుక్క కూడా వోటెయ్యదని చెప్పింది ఇందుకే.. జన్వాడ ఫామ్ హౌస్ల ‘కుటుంబ’ రేవ్ పార్టీ !!’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అర్వింద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.