అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగర ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మేయర్ నీతూకిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అలాగే అభివృద్ధి పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ మురళి మనోహర్ రెడ్డి, డీసీపీ శ్యాంకుమార్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శంకర్, ఎలక్రిసిటీ డీఈలు ఆనంద్‌సాగర్, ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు.