అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్ ఢిల్లీవాలా స్వీట్ హోంపై కేసు నమోదు చేసినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు. తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ కారణంగా దుకాణాన్ని మూసి వేసినట్లు ఆదివారం రాత్రి స్వీట్ హోం నిర్వాహకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో తమ తప్పేమీ లేదని, స్వీట్ హోం ఎదుట రోడ్డుపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సిబ్బంది అక్కడికి వెళ్లారని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వీట్ హోం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.