అన్నివర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

0

అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. శనివారం డిచ్పల్లి మండలం నడిపల్లి జీపీ పరిధిలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ అందదని బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేసిందన్నారు. కానీ, తమ ప్రభుత్వం రైతులతో పాటు గృహవసరాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు అందిస్తుందని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, అమృతాపూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.