అక్షరటుడే, ఇందూరు: సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని కులాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేతో కుటుంబాల ఆర్థిక, ఉపాధి పరిస్థితి ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. అందరికీ న్యాయం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడడమే ప్రభుత్వాలోచన అని పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీలోపు సర్వే పూర్తి కావాలనే ఎజెండాతో ముందుకు వెళ్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఆరు గ్యారెంటీలపై అనవసరపు మాటలు మాట్లాడుతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజారెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్, డీసీసీబీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యుడు జావేద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, జిల్లా అధ్యక్షుడు విక్కీ యాదవ్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు రాజ్ పాల్గొన్నారు.