అక్షరటుడే, ఇందూరు: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. పోలీసు, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని శ్రీరామ గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో పాటు కాలనీలో వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించాలన్నారు. కొందరు పాఠశాల స్థాయిలోనే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా రవాణా శాఖ కమిషనర్ దుర్గా ప్రమీల, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, డీసీపీ బస్వారెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు రూల్స్ పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీటీసీ ఉమామహేశ్వరరావు, ఎంవీఐ కిరణ్ కుమార్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
