అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : ప్రజలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. పోషణ మాసం సందర్భంగా డిచ్‌పల్లిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు సూదాం లక్ష్మి, డీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, డీఎంఎచ్ వో రాజశ్రీ, సీడీపీవో స్వర్ణలత, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.