కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ కవితారెడ్డి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కవితా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం హైదారాబాద్ లో పార్టీ కండువా కప్పుకున్నారు. నగరానికి చెందిన కవితా రెడ్డి గత ముప్పై ఏళ్లుగా గైనకాలజీ వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఆమె భర్త రవీందర్ రెడ్డి సైతం పిల్లల వైద్యునిగా కొనసాగుతున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తితో ఉన్న కవితారెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ లోక్ సభ టికెట్ ఆశించారు. చివరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. తాజాగా ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ గెలుపు కోసం పని చేస్తానని కవితా రెడ్డి తెలిపారు.