రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

0

అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలకు జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 46 మంది క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో ప్పాల్గొంటారని తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో జిల్లా సెపక్‌తక్రా అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు దీపిక, కార్యనిర్వాహణ కార్యదర్శి చామకూర బాగారెడ్డి, ప్రిన్సిపాల్‌ పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులు వీరే..

జూనియర్‌ బాలుర విభాగంలో ఉదయ్‌ కుమార్‌, హనోక్‌, రాహుల్‌, జైల్‌సింగ్‌, నెహ్రూ ఎంపిక కాగా.. బాలికల విభాగంలో రిక్కిరెడ్డి, శ్రీజ, శ్రేష్ట, లాస్య ప్రియ, అక్షర, లాస్యశ్రీ, రిషిత సెలెక్ట్‌ అయ్యారు. సబ్‌ జూనియర్‌ బాలుర విభాగంలో భవిక్‌, ప్రణయ్‌ వంశీ, మిథున్‌ తేజ, సాత్విక్‌, అర్జున్‌, బాలిక విభాగంలో వర్షిని, యోగేశ్వరి, మన్విత, మన్వి, భవ్యశ్రీ రెడ్డి ఎంపికయ్యారు. జట్ల కోచ్‌, మేనేజర్లుగా గాదరి సంజీవరెడ్డి, ఎల్‌.శ్రీనివాస్‌, సరళ, కళ్యాణ్‌ వ్యవహరిస్తారు.