అక్షరటుడే, మాక్లూర్: మాక్లూర్ మండలం చిన్నాపూర్ సమీపంలోని సింగంపల్లి శివారులో మొరం అక్రమ తవ్వకాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా మొరం తవ్వుతున్న చోట 21 టిప్పర్లు, 2 జేసీబీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వాహనాలను మాక్లూర్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మన్న, సుదర్శన్, రాజేశ్వర్, రాములు, గజేందర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఒకవైపు తన ఇలాకాలో అక్రమ మైనింగ్ చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గతంలోనే హెచ్చరించారు. అయినప్పటికీ.. మొరం అక్రమ తవ్వకాలు మాత్రం ఆగట్లేదు.