అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. నగరంలోని ఓ మిల్లులో బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు జరిపారు. కాగా.. పీడీఎస్ బియ్యం బస్తాల లోడుతో ఉన్న లారీని పట్టుకున్నారు. అనంతరం మిల్లులోనూ భారీగా బియ్యం నిల్వలు గుర్తించారు. అనంతరం సదరు మిల్లును సీజ్ చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వందల క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. అయితే టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ విషయమై గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటి వరకు వివరాలేవీ బయటకు వెల్లడించలేదు.