అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో ఓ లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న వ్యవహారంపై పోలీసులు సోదాలు జరిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జిలో గురువారం రాత్రి తనిఖీలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టారు. సదరు లాడ్జి కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల పలు వీడియోలు బయటకు రావడంతో పోలీసులు సోదాలు చేశారు. తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.