అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో కోత విధించనున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పవర్ హౌస్, తిలక్ గార్డెన్, దుబ్బ, మిర్చి కంపౌండ్, వినాయక్‌నగర్, బోర్గాం(పి), న్యూ కలెక్టరేట్, ముబారక్‌నగర్, సుభాష్‌నగర్, అర్సపల్లి, న్యూ హౌసింగ్ బోర్డు, గూపన్‌పల్లి ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుందన్నారు.