అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో బుధవారం జిల్లా కేంద్రంలోని మార్నింగ్ కోర్టులో నలుగురు వ్యక్తులను హాజరుపర్చారు. వీరిలో ముగ్గురికి జడ్జి అహ్మద్ మోహియుద్దీన్ రూ. 7వేల జరిమానా విధించారు. కాగా.. మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.
Advertisement
Advertisement