అక్షరటుడే, నిజామాబాద్ నగరం: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రైతు కంఠం పురుషోత్తం 1.2 క్వింటాళ్ల పసుపు పంటను అమ్మకానికి తీసుకువచ్చాడు. క్వింటాకు రూ.19,211 ధర పలకడం విశేషం. అలాగే పెర్కిట్ కు చెందిన మరో రైతు తీగల గంగారెడ్డికి రూ.18,299 ధర పలికింది. ఈ రైతు మొత్తం 18 క్వింటాళ్లు విక్రయించారు. రికార్డు స్థాయిలో ధరలు పలకడం పట్ల ఎంపీ అర్వింద్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే పసుపు ధర రూ.20 వేలు దాటే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.