రాహుల్ గాంధీ మతి తప్పి మాట్లాడుతున్నారు

0

అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మతి తప్పి మాట్లాడుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నార న్నారు. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ కుటుంబం, బీఆర్ఎస్ కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడుతుంద న్నారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, న్యాలం రాజు, ప్రవళిక, లక్ష్మీనారాయణ, మెట్టు విజయ్ తదితరులు పాల్గొన్నారు.