అక్షరటుడే, ఇందూరు: వసతిగృహంలో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు. నగరంలోని నాందేవ్ వాడలో గల గిరిజన వసతిగృహాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, విద్యార్థుల సమస్యలన్నింటిని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారంలోగా పరిష్కరించకుంటే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట కార్పోరేటర్లు మాస్టర్ శంకర్, సుధీర్, ప్రవళిక శ్రీధర్ ఉన్నారు.