అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ మంగళవారం నగరంలోని దేవి థియేటర్ సమీపంలో గల శ్మశాన వాటికను పరిశీలించారు. దహన సంస్కార కార్యక్రమాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వారి వెంట మున్సిపల్ సిబ్బంది, బీజేపీ నాయకులు ఉన్నారు.