అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: ఇందూరు ఫుట్‌బాల్ టోర్నీ గురువారం మొదలైంది. పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌ను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరు జిల్లా అంటేనే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుధీర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ఫుట్‌బాల్ అసోసియేషన్ సంజయ్, బీజేపీ నాయకులు ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.