అక్షరటుడే, ఇందూరు: నగరంలోని హైదరాబాద్ రోడ్డులో పీఎంజే జ్యుయలరీ నూతన షోరూంను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా శనివారం ప్రారంభించారు. పీఎంజే జ్యుయలరీ తెలంగాణ క్లస్టర్ హెడ్ మహేశ్వరం మదన్ కుమార్ తో కలిసి జ్యోతి వెలిగించి అవుట్‌లెట్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్‌లో పీఎంజే జ్యుయలరీ షోరూంను విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం షోరూంలోని జ్యుయలరీ కలెక్షన్ ను తిలకించారు. కార్యక్రమంలో జ్యుయలరీ నిజామాబాద్ స్టోర్ హెడ్ వడ్నాల కమల్, సిబ్బంది పాల్గొన్నారు.
