అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజును తెలంగాణ తల్లి ఉత్సవాలు అవతరణ దినోత్సవంగా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్‌అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సోనియా గాంధీని గతంలో బలిదేవతగా పోల్చారని.. నేడు ఆమె మెప్పుకోసం జన్మదినం రోజు అవరణ వేడుకగా జరుపుతున్నారని విమర్శించారు. ఈ నిర్ణయంతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు గోషిస్తాయన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరపకపోవడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలన్నారు. తెలంగాణకి ప్రతీక అయిన బతుకమ్మను విగ్రహం నుంచి తొలగించడం పెట్టకపోవడం అవమానించినట్లేనన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. ఉత్సవాల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.