అక్షరటుడే, ఇందూరు: హెచ్ సీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అండర్-23 క్రికెట్ టోర్నమెంట్లో మంగళవారం మెదక్ జట్టుపై నిజామాబాద్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన మెదక్ జట్టు 234 పరుగులు చేసింది. జట్టులో వేదాంత్ 52, దీక్షిత్ 44 పరుగులు చేశారు. నిజామాబాద్ బౌలర్ జష్రీత్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టులో హర్షవర్ధన్ సింగ్ 114 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి అద్భుత ప్రతిభను కనబరిచాడు. జట్టుకు కోచ్ గా సురేష్ బాబు, ఫీల్డింగ్ కోచ్ గా లలిత్ రెడ్డి, మేనేజర్ గా నయీం వ్యవహరిస్తున్నారు. బుధవారం జిల్లా జట్టు నల్గొండతో తలపడనుంది.