అక్షరటుడే, బాన్సువాడ: ఇద్దరి మధ్య జరిగిన గొడవలో కేసు నమోదైన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ.50 వేలు డిమాండ్ చేశాడో ఎస్సై. తీరా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వర్ని ఎస్సై కృష్ణ కుమార్ ను ఓ రైతు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. వర్ని మండలం కోటయ్య క్యాంపునకు చెందిన రైతు నాగరాజుకు ఈనెల 4న ఓ వ్యక్తితో మండల కేంద్రంలో గొడవ జరిగింది. అదే రోజు ఎస్సై కృష్ణ కుమార్ నాగరాజుపై కేసు నమోదు చేశారు. కాగా.. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై రూ.50 వేలు డిమాండ్ చేశాడు. ఆఖరకు రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.