అక్షరటుడే, జుక్కల్: బోధన్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ నెల 4 (మంగళవారం) నుంచి నిజాంసాగర్ నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. నీటి విడుదల నేపథ్యంలో పశువుల కాపరులు నీటి ప్రవాహంలోకి వెళ్ళవద్దని, ప్రధాన కాలువలోకి స్నానం చేసేందుకు దిగవద్దని అధికారులు సూచించారు. తూముల షట్టర్లు నిబంధనలకు విరుద్ధంగా పైకి లేపి నీటిని మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.