నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ఖరారైంది. పార్టీ అధినేత కెసిఆర్ బుధవారం అధికారికంగా బాజిరెడ్డి పేరును ప్రకటించారు. గతంలో ఈయన ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి మరోసారి బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులిద్దరూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం.