అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రాంచందర్ మాట్లాడుతూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులు ఇంటి వద్ద చదువుతున్నారా లేదా అనే అంశాన్ని గమనించాలని సూచించారు. విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థుల పెయింటింగ్ ప్రాజెక్ట్ వర్క్ లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సీఆర్పీలు శ్రీధర్ కుమార్, నర్సింలు, ఉపాధ్యాయులు వెంకటేశం, రాములు, విజయ్ కుమార్, షాదుల్లా, రాజేందర్, సంఘమిత్ర, శైలజ పాల్గొన్నారు.