అక్షరటుడే, నిజాంసాగర్/ఎల్లారెడ్డి: మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు. శుక్రవారం నిజాంసాగర్ లో మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్, లక్ష్యయ్య, తదితరులు పాల్గొన్నారు.
మహమ్మద్‌నగర్‌లో..
మహమ్మద్‌నగర్‌లో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకాశ్, లౌకియా నాయక్, సవాయిసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి, లింగంపేటలో కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఘననివాళులర్పించారు.

మహమ్మద్‌నగర్‌లో..

లింగంపేటలో..