అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు శుక్రవారం మూడో విడత నీటి విడుదల చేపట్టారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1.35లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. రెండువిడతల్లో ఇప్పటివరకు 3.84 టీఎంసీల నీటిని విడుదల చేశామని, మూడోవిడతలో 15 రోజులపాటు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులకు, 1401.44 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement