అక్షరటుడే, వెబ్‌డెస్క్: Income Tax | కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వారు, ఇన్‌కం ట్యాక్స్ income tax పరిధిలోకి వచ్చిన వారు చాలా మంది ఐటీ రిటర్న్స్ IT returns ఫైల్ చేయరు. ఇన్ కం ట్యాక్స్ income tax కట్టకుండా ఇలా ఎంతో మంది తప్పించుకుంటూ ఉంటారు. దీంతో అలాంటి వారి ఆట కట్టించడానికి ఐటీ శాఖ IT department సిద్ధం అయింది. భారీ మొత్తంలో లావాదేవీలు చేపట్టే వారి వివరాలు, పెద్ద మొత్తంలో ఆస్తుల కొనుగోలు, క్రెడిట్ కార్డు యూసేజ్ credit card usage వంటి అంశాలను ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Artificial Intelligence(AI)తో తనిఖీ చేయనుంది. అనంతరం వారికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తోంది.
ప్రతి ఆర్థిక సంవత్సరం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, ఇతర సంస్థలు ‘స్టేట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ (SFT)’ నివేదికను ఐటీ శాఖకు IT department సమర్పిస్తాయి. ఇందులో ప్రజల అన్ని రకాల లావాదేవీల transactions వివరాలు ఉంటాయి. వీటిని ఏఐతో తనిఖీ చేయాలని ఆ శాఖ యోచిస్తోంది. అందులో అధిక మొత్తం కలిగి ఇన్‌కం ట్యాక్స్ income tax పరిధిలోకి వచ్చే వారికి నోటీసులు ఇవ్వనున్నారు. అంతేగాకుండా ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ల డాటాను కూడా ఏఐతో విశ్లేషించనుంది. తప్పుడు క్లెయిమ్‌లను గుర్తించడానికి ఇది ఉపయోగ పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.