అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pink Book | భారతీయ రైల్వేలో Indian Railways ‘పింక్ బుక్’ కీలక పాత్ర పోషించేది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ central budget ప్రవేశ పెట్టిన తర్వాత ఆయా జోన్ల వారీగా రైల్వేల బడ్జెట్, ఖర్చులు, నిధుల కేటాయింపు, సేవలు, పనులు తదితర వివరాలతో పింక్ బుక్ pink bookను రైల్వేశాఖ తీసుకొచ్చేది. పింక్ బుక్ అంటే ప్రాధాన్యతా పనుల కోసం మంత్రిత్వ శాఖ చేసిన మౌలిక సదుపాయాలకు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో సూచించే అధికారిక ఆదేశంగా భావించేవారు.
బడ్జెట్ అయిపోయాక ఈ బుక్ కోసం ఆయా జోన్ల వారీగా ఉద్యోగులు ఎదురు చూసేవారు. అయితే ఇక నుంచి ఈ పింక్ బుక్ కనుమరుగు కానుంది. ఐకానిక్ పింక్ బుక్‌ల ముద్రణను రైల్వేశాఖ నిలిపివేసింది. దీనికి బదులుగా జోన్ వారీగా బడ్జెట్ పత్రాలను జారీ చేయనుంది.
Pink Book | గణనీయమైన మార్పులు
కేంద్ర ప్రభుత్వం 2017లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేసింది. నాటి నుంచి గణనీయమైన విధానపరమైన మార్పులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పింక్ బుక్ ప్రచురణను నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి జోన్, ఉత్పత్తి యూనిట్‌కు అనుగుణంగా సమగ్ర బడ్జెట్ పత్రాలను Budget Papers జారీ చేయనుంది.
Pink Book | సమగ్ర వివరాలతో..
ప్రతి జోనల్ రైల్వే, ఉత్పత్తి యూనిట్ కోసం సమగ్ర బడ్జెట్ పత్రాలను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆదాయాలు, పని ఖర్చులు, మూలధన వ్యయం, పనుల జాబితా మొదలైన వివరాలను కలుపుకొని సమగ్రంగా వీటిని రూపొందించనున్నారు. ఈ పత్రాలను తయారు చేసే పని ఇప్పటికే ప్రారంభమైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ Aswini Vaishnav తెలిపారు.