అక్షరటుడే, న్యూఢిల్లీ: vehicles : పాత వాహనాల old scrap vehicles విషయంలో ఢిల్లీ సర్కారు delhi government కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి ఢిల్లీలో 10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్/CNG వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు రవాణా శాఖ(Transport Department of delhi) ప్రకటించింది.
ఢిల్లీ సర్కారు తాజా నిర్ణయం 55 లక్షలకు పైగా వాహనాలపై ప్రభావం పడనుంది. అలాంటి వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం కూడా సర్కారు పూర్తిగా నిషేధించింది.
ఢిల్లీలో పాత వాహనాలను నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో(public places) నిలిపినా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వాహనాన్ని జప్తు చేసే అవకాశం లేకపోలేదు.
ఢిల్లీ(Delhi) ప్రభుత్వం 477 పెట్రోల్ పంపులలో కొత్త వ్యవస్థను తీసుకురాబోతోంది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాల వయసుకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంటుంది. వాహనం నిర్దేశించిన పరిమితి కంటే పాతదైతే, వాటికి పెట్రోల్/డీజిల్ పోయొద్దని మార్గదర్శకాలు (Guidelines) జారీ చేశారు.