DHARNA : మూడు నెలలుగా వేతనాల్లేవు..
DHARNA : మూడు నెలలుగా వేతనాల్లేవు..
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: DHARNA : మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, త‌మ కుటుంబాల‌ను ఎలా పోషించుకోవాల‌ని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఏరియర్స్, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. విధుల నుంచి అకారణంగా తొలగించిన 12 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించి వేతనాలు విడుదల చేయాలని లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునియన్ నాయకులు, మున్సిపల్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement