అక్షరటుడే, వెబ్‌డెస్క్ : వైద్యశాస్త్రంలో చేసిన కృషికి గాను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీరవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం 2024 వరించింది. ఈమేరకు స్వీడన్‌లోని స్టాక్‌హాంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. మైక్రోఆర్‌ఎన్‌ఏ, పోస్ట్ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా వారికి ఈ పురస్కారం లభించింది. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. 11 లక్షల స్వీడిష్ క్రోనర్(10 లక్షల డాలర్లు) నగదును అవార్డు గ్రహీతలు అందుకోనున్నారు. డిసెంబర్ 10న వీరికి పురస్కారాన్ని అందజేస్తారు.