temperature | ఉడుకుతున్న ఉత్త‌ర భార‌తం.. దంచికొడుతున్న ఎండ‌లు

temperature | ఉడుకుతున్న ఉత్త‌ర భార‌తం.. దంచికొడుతున్న ఎండ‌లు
temperature | ఉడుకుతున్న ఉత్త‌ర భార‌తం.. దంచికొడుతున్న ఎండ‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: temperature | ఎండలు దంచికొడుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా వేడిగాలులు భ‌య‌పెడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ India Meteorological Department తెలిపింది. ఢిల్లీ నుంచి మ‌హారాష్ట్ర Delhi to Maharashtra వ‌ర‌కు.. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు temperatures పెరిగిపోతున్నాయ‌ని, రాత్రుల్లోనూ ఉక్క‌పోత ఎక్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొంది. ఎండ‌వేడిమి ప్ర‌జారోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రించింది.

Advertisement
Advertisement

temperature | భ‌గ‌భ‌గమంటున్న సూరీడు

అనేక రాష్ట్రాలు వేడిగాలులతో heat waves అల్లాడుతున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో స‌గ‌టు కంటే ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభం నాటికి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రచ, మధ్యప్రదేశ్‌లోని 27 ప్రాంతాల్లో 43°C లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను above-average temperatures నమోద‌య్యాయి. వాటిలో కనీసం 19 ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్‌లలో పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా ఎక్కువగా ఉన్నాయి, తరచుగా 44°C కంటే ఎక్కువగా న‌మోద‌వుతున్నాయి. రాజస్థాన్‌లోని బార్మర్ వంటి నగరాల్లో 46.4°C, మహారాష్ట్రలోని జల్గావ్‌లో 42.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో 40°C, రాత్రి 25.6°C డిగ్రీలుగా న‌మోదైంది. అక్క‌డ గాలి నాణ్యత Air quality కూడా బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ సూచిక (209 స్థాయికి చేరుకుంది.

temperature | మూడు నెల‌లు క‌ష్ట‌మే..

ఏప్రిల్ ప్రారంభంలోనే ఇంత‌లా దంచికొడుతుంటే రానున్న రోజుల్లో ఎండ‌లు మ‌రింత పెరుగ‌నున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ వేడి సంక్షోభంలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో, ఏప్రిల్, మే, జూన్ వరకు ఉష్ణోగ్రతలు 40°C కంటే ఎక్కువగా ఉంటాయని, బుందేల్‌ఖండ్ ప్రాంతం అత్యంత తీవ్రంగా దెబ్బతింటుందని వాతావ‌ర‌ణ శాఖ Meteorological Department అంచనా వేసింది. బుధవారం ముంబైలో అత్యధికంగా 34°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తేమ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అధిక వేడి కారణంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ Brihan mumbai Municipal Corporation ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న ఒక రహదారి కరిగిపోయింది. ఈ నేప‌థ్యంలో ముంబైకి ఎల్లా అల‌ర్ట్ జారీ చేశారు. వృద్ధులు, పిల్ల‌లు, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప‌ని చేసే కూలీలు జాగ్ర‌త్తగా ఉండాల‌ని సూచించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Sunstroke | వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం

temperature | తెలంగాణ‌లో భిన్నంగా..

ఉత్తర, మధ్య రాష్ట్రాలు ఎండ‌ల‌తో అల్లాడుతుంటే, దక్షిణ భారతదేశం South India అస్థిరమైన, విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. హైదరాబాద్, నిజామాబాద్ వంటి నగరాల్లో తీవ్రమైన వేడితో తెలంగాణలో Telangana అసాధారణ వాతావరణ పరిస్థితులు నెల‌కొన్నాయి. అయితే అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

Advertisement