అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతను ఎక్కడా అవమానించలేదని, కేవలం అక్కినేని ఫ్యామిలీని మాత్రమే అవమానించారని ప్రముఖ డైరెక్టర్‌ ఆర్జీవీ పేర్కొన్నారు. ‘నిజం చెప్పాలంటే సురేఖ సమంతను పొగిడారు. అలాంటప్పుడు ఆమె సమంతకు ఎందుకు సారీ చెప్పాలని ప్రశ్నించారు’. ఇంకా మాట్లాడుతూ..‘అక్కినేని ఫ్యామిలీపై మంత్రి చేసిన ఆరోపణలు నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. నాగార్జున, చైతన్య కలిసి మంత్రి సురేఖకు జీవితంలో మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి’ అంటూ ఆర్జీవో విడుదల చేసిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.