Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు

Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు
Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Job Notifications | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ SC classification అమలులోకి రావడంతో ఉద్యోగాల భర్తీ job recruitment ఊపందుకోనుంది. వర్గీకరణ పూర్తి చేసే వరకూ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government గతంలో నిర్ణయించింది. దీంతో కొన్ని వేల ఉద్యోగ ప్రకటనల జారీ నిలిచి పోయింది.

Advertisement
Advertisement

అయితే, ఇటీవల అసెంబ్లీ assembly ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధం కావడంతో ప్రభుత్వం సోమవారం వర్గీకరణపై జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ SC classification అమలులోకి వచ్చింది. ఎస్సీలను మూడు కేటగిరీలుగా three categories విభజించిన  ప్రభుత్వం ఏ కేటగిరీలోని వారికి ఒక శాతం, బీ కేటగిరీలోని వారికి 9 శాతం, సీ కేటగిరీలోని వారికి 5 శాతం రిజర్వేషన్లు reservation కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశముంది.

Job Notifications | నోటిఫికేషన్లు ఆపిన ప్రభుత్వం..

ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ Congress party ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు SC classification సమ్మతి తెలుపుతూ సుప్రీంకోర్టు Supreme Court ఆదేశాలు జారీ చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం Revanth Reddy government ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని cabinet sub-committee ఏర్పాటు చేసింది. అదే సమయంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగ నియామయాలకు government job recruitments సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. వర్గీకరణ పూర్తయ్యాకే ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని తెలిపారు. మరోవైపు, ఆయా వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన కేబినెట్ కమిటీ Cabinet Committee ప్రభుత్వానికి తుది నివేదిక అందజేసింది.

ఇది కూడా చ‌ద‌వండి :  SC classification | తెలంగాణలో నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ

ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి, రిజర్వేషన్లు reservations అమలు చేయాలని సూచించింది. ఈ నివేదికను ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం government సుదీర్ఘ చర్చల అనంతరం ఆమోదం తెలిపింది. 14 శాతంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను SC reservation మూడు వర్గాలుగా విభజించింది. ఏ కేటగిరీలోని వారికి ఒక శాతం, బీ కేటగిరీలోని వారికి 9 శాతం, సీ కేటగిరీలోని వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Job Notifications | త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు

దేశంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ Telangana నిలిచింది. మరోవైపు, వర్గీకరణ కోసమే ఆపిన ఉద్యగో నోటిఫికేషన్లను job notifications జారీ చేసేందుకు ప్రభుత్వం government చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ Sub-Committee Chairman ఉత్తమ్​కుమార్​రెడ్డి Uttam Kumar Reddy విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగ ప్రకటనల గురించి వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకూడదని నిర్ణయించామని, అందుకనే నోటిఫికేషన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. వర్గీకరణ కొలిక్కి వచ్చినందున త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని వివరించారు.

Advertisement