new Income Tax Bill | ఇక అక్రమ ఆస్తుల గుట్టురట్టు..! కొత్త చట్టం తేనున్న కేంద్రం..

new Income Tax Bill | ఇక అక్రమ ఆస్తుల గుట్టురట్టు..! కొత్త చట్టం తేనున్న కేంద్రం..
new Income Tax Bill | ఇక అక్రమ ఆస్తుల గుట్టురట్టు..! కొత్త చట్టం తేనున్న కేంద్రం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: new Income Tax Bill | దేశంలో అక్రమార్కుల ఆటకట్టించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం(Central government) చెబుతోంది. ఇందులో భాగంగానే అవినీతి పరులు కూడబెట్టిన అక్రమ ఆస్తుల(Assets) గుట్టురట్టు చేసేందుకు కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

Advertisement
Advertisement

new Income Tax Bill | కొత్త బిల్లు(Bill)లో ఏముందంటే..?

నూతన ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తే ఐటీ శాఖకు విస్తృత అధికారాలు లభించే అవకాశం ఉంది. సోషల్‌ మీడియా(Social media) ఖాతాలను యాక్సెస్‌ చేసే అధికారాన్ని సైతం శాఖకు కట్టబెడుతూ కొత్త బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. దీనివల్ల ట్యాక్స్‌పేయర్స్‌ సోషల్‌ మీడియా అకౌంట్స్‌తో పాటు వ్యాపారానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌, లావాదేవీలను దాచడానికి ఉపయోగించే సర్వర్‌లను ఐటీ శాఖ యాక్సెస్‌ చేయగలుగుతుంది. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులు, ఈమెయిల్‌ సర్వర్లు, సోషల్‌ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్‌(Online) ఇన్వెస్ట్‌మెంట్‌ వివరాలను ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను పరిశీలించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉద్దేశ పూర్వక పన్ను ఎగవేతలను నిరూపించడానికి ఇవి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Question paper | "పది" ఎగ్జామ్ సిబ్బందిపై వేటు..!

new Income Tax Bill | కొత్త బిల్లుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు

అయితే ఈ చట్టం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఈ బిల్లుపై ముందుకు వెళ్లాలనే కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్‌ కూడా సమర్థించారు. అక్రమ ఆస్తుల గుట్టు విప్పడానికి నూతన ఆదాయపు పన్ను చట్టం వీలు కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. వాట్సాప్‌ మెసేజెస్‌ను పరిశీలించడం ద్వారా క్రిప్టో(Crypto) అసెట్స్‌తో ముడిపడి ఉన్న రూ. 200 కోట్లకుపైగా అక్రమ సొమ్మును గుర్తించినట్లు పార్లమెంట్‌ సమావేశాల్లో పేర్కొన్నారు.

Advertisement