అక్షర టుడే, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కేసులో మాక్లూర్ మండల ఎన్‌పీడీసీఎల్ ఏఏఈ మచ్చ సదాశివ్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ తీర్పు ఇచ్చినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన కేసరి శ్రీనివాస్‌రెడ్డి మాక్లూర్‌లోని తన వ్యవసాయ పొలాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు నూతన విద్యుత్ కనెక్షన్ల కోసం ఏఏఈ సదాశివ్‌ను సంప్రదించగా, ఆయన రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో అంత ఇచ్చుకోలేనని అనగా, రూ.3వేలకు ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేక శ్రీనివాస్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా సదాశివ్ ను నేరుగా పట్టుకున్నారు. కాగా.. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సదాశివ్‌కు ఏడాది జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.