Advertisement
అక్షరటుడే, బోధన్: Bodhan | గత పదేళ్లకు సంబంధించిన పెండింగ్ వేతన బకాయిలను చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించేందుకు వెళ్లాలనుకున్న కార్మికులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. తమ సమస్యలను విన్నవించుకోవాలనుకున్న కార్మికులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. అరెస్టయిన వారిలో కార్మిక నాయకులు ఉపేందర్, కుమారస్వామి, మల్లేశ్ తదితరులు ఉన్నారు.
Advertisement