అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ విశ్వవిద్యాలయానికి త్వరలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరవుతుందని ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రపాయంగా అంగీకరించారని పేర్కొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇప్పటికే సీఎంకు నివేదించారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్తి సహాయం అందిస్తానని మాటిచ్చారన్నారు. ఇంజినీరింగ్ కళాశాలతో పాటు మరో బాలికల వసతి గృహం, కొత్త కోర్సులు, స్పోర్ట్స్ బోర్డు, ఆడిటోరియం ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో నాయకులు నిఖిల్, రెడ్డి, శివ, చింటూ, హరీశ్, శ్రవణ్, సృజన్, ధనుష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.