NTR : ఎన్టీఆర్ జెప్టో యాడ్ మీద సోషల్ మీడియాలో సెటైర్స్.. ఫ్యాన్స్ కూడా అప్సెట్ ఎందుకంటే..?

NTR : ఎన్టీఆర్ జెప్టో యాడ్ మీద సోషల్ మీడియాలో సెటైర్స్.. ఫ్యాన్స్ కూడా అప్సెట్ ఎందుకంటే..?
NTR : ఎన్టీఆర్ జెప్టో యాడ్ మీద సోషల్ మీడియాలో సెటైర్స్.. ఫ్యాన్స్ కూడా అప్సెట్ ఎందుకంటే..?
Advertisement

NTR : స్టార్ హీరోలు సినిమాల్లోనే కాదు, వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తారు. సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ నుంచి మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఎక్కువ యాడ్స్ చేస్తుంటారు. మహేష్ అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్ కూడా కొన్ని బ్రాండ్ లను ప్రమోట్ చేస్తుంటాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ జెప్టో కోసం ఒక యాడ్ చేశాడు. ఈ మధ్యనే అది టెలికాస్ట్ అవుతుంది. ఐతే ఈ యాడ్ కాన్సెప్ట్ బాగున్నా ఎన్టీఆర్ లుక్ మాత్రం ఫ్యాన్స్ ని డిస్సాపాయింట్ చేసింది.

ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ విచిత్రంగా ఉంది. అంతేకాదు ఎంతో కామెడీగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెప్టో యాడ్ చూసి తమ అభిమాన హీరో ఇలాంటి యాడ్స్ ఎందుకు చేస్తాడో అనుకుంటున్నారు. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే జెప్టో ఎన్టీఆర్ యాడ్ ని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. స్టార్ హీరోకు ఇవన్నీ కామనే కానీ నిజంగానే జెప్టో యాడ్ లో తారక్ విచిత్రంగా ఉన్నాడు.

NTR : దేవరలో అగ్రెసివ్ ఎన్టీఆర్..

దేవర లో అగ్రెసివ్ ఎన్టీఆర్ ని చూసిన ఫ్యాన్స్ ఇలా జెప్టో కోసం ఒక కమెడియన్ తో కలిసి చేయడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇలాంటి యాడ్స్ చేయడం వల్ల ఫ్యాన్స్ ని అలరించడం మాట అటుంచితే ఫ్యాన్స్ అసంతృప్తికి కారణం అవుతారు. జెప్టో యాడ్ వల్ల ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో ఏమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది చేయకుండా ఉండాల్సింది అని అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  JR NTR : జైలర్ 2 తర్వాత ఎన్టీఆర్​తోనే నెల్సన్.. కథ మొదలైతే వేట మొదలైనట్టే..!

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవర 1 తర్వాత బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు తారక్. ఆ సినిమాతో పాటు రీసెంట్ గా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ వార్ 2 ఈ ఇయర్ ఆగష్టు రిలీజ్ ఉండగా 2026 లో ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement