NTR : ఎన్టీఆర్ నెల్సన్.. ఫ్యూజులు ఎగిరిపోయే ‘రాక్’ సాలిడ్ టైటిల్ ..!

NTR : ఎన్టీఆర్ నెల్సన్.. ఫ్యూజులు ఎగిరిపోయే 'రాక్' సాలిడ్ టైటిల్ ..!
NTR : ఎన్టీఆర్ నెల్సన్.. ఫ్యూజులు ఎగిరిపోయే 'రాక్' సాలిడ్ టైటిల్ ..!
Advertisement

NTR : RRR తర్వాత దేవర మొదటి భాగంతో ఫ్యాన్స్ ని అలరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాపై పూర్తి ఫోకస్ చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అనేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యారు. ఇక ఇదిలాఉంటే ఎన్టీఆర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ తో ఒక సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలిసిందే. సితార బ్యానర్ లో నాగ వంశీ ఈ మూవీ నిర్మించనున్నారు. ప్రస్తుతం సొపోర్ స్టార్ రజినీతో జైలర్ 2 సినిమా చేస్తున్నాడు నెల్సన్. ఆ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ నెల్సన్ సినిమా కు టైటిల్ కూడా ఫిక్స్ చేశారని లేటెస్ట్ టాక్. ఈ కాంబో సినిమాకు రాక్ అనే అదిరిపోయే టైటిల్ ని పెడుతున్నారట.

ఇది కూడా చ‌ద‌వండి :  Anasuya : చీరలో రంగమ్మత్త.. చూపులతోనే హృదయాలను కొల్లగొట్టేసేలా..!

NTR : ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన టైటిల్..

రాక్ టైటిల్ నిజంగానే రాక్ సాలిడ్ గా ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన టైటిల్ అంటూ ఫ్యాన్స్ ఈ టైటిల్ బయటకు గురించి చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నెల్సన్ యాక్షన్ సీన్స్ బాగా తీస్తాడు. అలాంటి డైరెక్టర్ చేతుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పడుతున్నాడు అంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఊచకోత కన్ ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు.

ఎన్టీఆర్ నెల్సన్ రాక్ సినిమాలో హీరోయిన్ ఎవరు సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది. రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారన్నది తర్వాత తెలుస్తుంది. ఎన్టీఆర్ రాక్ సినిమా విషయంలో ఫ్యాన్స్ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే అదిరిపోయే బజ్ ఏర్పరచుకుంది. సితార నాగ వంశీ ప్రతి ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి అంచనాలు పెంచేస్తున్నాడు.

Advertisement