అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని నుడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా నగరంలో 9వ డివిజన్‌లోని యాదవసంఘంలో డివిజన్ అధ్యక్షుడు శోభన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఖుద్దూస్, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, నంది వినయ్, జావేద్ అక్రం, రామకృష్ణ, రేవతి, సంతోష్, విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement