అక్షరటుడే, ఇందూరు: జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర నిబద్ధతతో పనిచేసి.. జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని నుడా ఛైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మల్లెపూల నరేంద్ర 34 వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. చిన్న వయసులోనే జర్నలిస్టు వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉన్న మల్లెపూల నరేంద్ర 1991 జనవరి 29న ముదక్పల్లి వద్ద పోలీసులు, నక్సలైట్ల ఎదురు కాల్పులలో మృతి చెందడం బాధాకరమన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీకి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పోటీల్లో గెలిచిన జర్నలిస్టులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, బైరి శేఖర్, స్పోర్ట్స్ కమిటీ వ్యవస్థాపక సభ్యుడు సాంబయ్య, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర ఆదర్శప్రాయుడు
Advertisement
Advertisement