అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని సెవెన్‌ హిల్స్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న మమత(23) అనే నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. బీర్కూరు మండలం బరంగెడ్గికి చెందిన మమత పట్టణంలోని చైతన్య కాలనీలో నివాసముంటూ స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మమత మృతదేహాన్ని బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వదిలి వెళ్లిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. సీఐ కృష్ణ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.